కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమై విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిని రీమేక్ చేసిన ధృవ్ విక్రమ్ కి ఆ చిత్రంతో అంతగా సక్సెస్ రాలేదు. ఆతర్వాత ఏదో ట్రై చేసి.. ఫైనల్ గా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అంటూ ఒక డిఫ్రెంట్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అక్టోబర్ 17వ తేదీన తమిళ థియేటర్లలో బైసన్ విడుదలైంది.
తమిళనాట అనూహ్య విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేసారు. అయితే తెలుగులో ధృవ్ కి అంతగా క్రేజ్ లేకపోవడం, ప్రమోషన్స్ లేకపోవడంతో ధృవ్ హిట్ సినిమా బైసన్ ని ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇక ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా, ఏ ప్లాట్ ఫామ్ నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది అనే ఆసక్తితో ఓటీటీ ఆడియన్స్ కనిపించారు.
ఇప్పుడు బైసన్ చిత్రం ఓటీటీ డేట్ లాక్ అయ్యింది. బైసన్ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం థియేటర్స్ లో మిస్ అయిన బైసన్ ను ఓటీటీలో వీక్షించేందుకు రెడీ అవ్వండి.