Advertisement
Google Ads BL

i బొమ్మ క్లోజ్: సజ్జనార్ కు చిరు-నాగ్ థాంక్స్


రెండు రోజుల క్రితం తెలంగాణ పోలీసులు iబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించారు. విదేశాలలో కూర్చుని దమ్ముంటే పట్టుకోండి అంటూ ఛాలెంజ్ చేసిన రవి ని తెలంగాణ పోలీసులు మట్టుబెట్టారు. కూకట్ పల్లిలో రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా... విచారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Advertisement
CJ Advs

సిపి సజ్జనార్ తో సినీ ప్రముఖులు ముఖ్యంగా మెగాస్టార్ చిరు, కింగ్ నాగ్, దర్శకధీరుడు రాజమౌళి భేటీ అయ్యి తెలంగాణ పోలీసులకు కృతఙ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. 

ఇమ్మడి రవి ది వైజాగ్.. మహారాష్ట్ర లో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు.. పాన్ కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతో ఉంది.. 

ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది ఇమ్మడి రవి కి. కరేబియన్ ఐల్యాండ్ సిటిజన్ షిప్ కూడా తీసుకున్నాడు.. ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు. 

అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లను పెట్టాడు.. టెలిగ్రామ్ యాప్ లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేసాడు.. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశాడు.. ఐ బొమ్మ సైట్ ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసిరాడు.. కొన్ని నెలల పాటు శ్రమించి ఇమ్మడి రవి ని పట్టుకున్నామ్ అని సజ్జనార్ తెలిపారు. 

ఇమ్మడి రవి ని పట్టుకున్న తర్వాత చాలా మంది పోలీసుల పైన మీమ్స్ చేస్తున్నారు. అది సరైంది కాదు.. చేసే వాళ్ళ పైన కూడా నిఘా ఉంటుంది.. ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మ ను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఆ విషయం మర్చిపోయారు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. 

చాలా ఏళ్లుగా పైరసీ బాధించింది.. లక్షలాది మంది సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడి ఉన్నారు.. ఇంతమంది కష్టాన్ని ఒకడు వచ్చి అప్పనంగా ఎత్తుకుపోతే ఎలా..?? గత cp CV ఆనంద్, ప్రస్తుత cp సజ్జనార్ ఇద్దరు ఎంతో శ్రమించి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు.. పైరసీ ని ఇక్కడితో అరికట్టాలి.. పోలీస్ శాఖ కి మా కృతజ్ఞతలు అంటూ రాజమౌళి అన్నారు. 

పోలీసులకు సవాల్ చేసి.. భస్మాసుర హస్తం లా తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడు ఇమ్మడి రవి. ఏది ఊరికే రాదు.. ఐ బొమ్మ లో ఉచితంగా సినిమాలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించారా..?  మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలి అంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు.. మా సినిమా వాళ్ళ కంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారు అంటూ నాగార్జున మాట్లాడారు. 

Tollywood Heads Meet Sajjanar:

Tollywood Celebs on Piracy Amid iBomma Ravi Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs