మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వివాహం విషయంలో బోలెడన్ని రూమర్స్ వినిపించాయి. హీరోయిన్ రెజీనాని సాయి ధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్ చేయూసుకోబోతున్నాడు, వరుణ్ తేజ్ తర్వాత పెళ్లి సాయి ధరమ్ దే అంటూ ప్రచారం కూడా జారీగింది. మీరు ఇలాంటి రాయడం వల్లే నన్ను ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది అంటూ సాయి ధరమ్ మొన్నామధ్యన ఓ ప్రెస్ మీట్ లో చెప్పాడు.
ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ అక్కడ తన పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈరోజు విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. పెళ్లి గురించి మాట్లాడుతూ వచ్చే ఏడాది అంటే 2026 లో తన వివాహం జరుగుతుంది అంటూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాదు అదే ఏడాది తను నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా విడుదల కాబోతున్నట్టుగా, మంచి లైఫ్ తో పాటుగా మంచి సినిమాలు ఇచ్చిన వేంకటేశ్వరుడికి కృతఙ్ఞతలు తెలిపేందుకే తిరుమల వహ్చిఅంట్టుగా సాయి ధరమ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.