బిగ్ బాస్ సీజన్ 9 లో క్రేజీ కంటెస్టెంట్, బుల్లితెర ఆడియన్స్ మెచ్చిన కంటెస్టెంట్ తనూజ.. మొదటి వారం నుంచి టాస్క్ విషయంలో బాగానే ఆడినా.. కొన్ని కొన్ని సందర్భాల్లో తనకు దగ్గరైన వారిని తనే దూరం చేసుకుంటుంది. బాండింగ్ అంటూ భరణి ని దూరం చేసుకుంది, ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ లేదు అంటూ ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంది.. కళ్యాణ్ తో అంటీముట్టనట్టుగా ఉంటుంది.
ఆటలో సూపర్, అలాగే బయట క్రేజ్ సూపర్, ఆమె గ్రాఫ్ అమాంతం పెరగడము సూపర్. కానీ తనూజ అటు బాండింగ్స్ ని తెంచుకోవడమే కాదు ఇటు తన గ్రాఫ్ ని తనే పడేసుకుంటుంది. తనకు హౌస్ లో ఎవరు సపోర్ట్ లేరు అంటూ ముందు నుంచి మాట్లాడుతుంది. భరణి, ఇమ్మాన్యుయెల్ సపోర్ట్ చేసినా, కళ్యాణ్, రీతూ లు హెల్ప్ చేసినా, డిమోన్ పవన్ తనూజ కి సపోర్ట్ చేసినా ఏది ఆమె కాదనేస్తుంది.
ఈ వారం తను ఓన్ గా కెప్టెన్సీ టాస్క్ ఆడి పోరాడి గెలిచింది. కానీ అక్కడ కూడా హౌస్ లో ఆమెను సంజన సపోర్ట్ చెయ్యడం వల్లే కదా నిఖిల్ ఓడిపోయింది. మరోపక్క భరణి ని ఓపెన్ గానే అడిగింది సపోర్ట్ చెయ్యమని, అలాగే చాలామందిని అడిగింది. కానీ నాగార్జున ముందు నాకు సపోర్ట్ లేదు అనేసింది.
దానితో తనూజ ను సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు. తనూజ నాకు సపోర్ట్ లేదు అనేసింది, మాకైతే దిమ్మతిరిగింది అంటూ రివ్యూస్ చెప్పేవాళ్ళు, ఇంకా సోషల్ మీడియా ఫ్యాన్స్ కూడా తనూజ పై నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. అదే ఆమెకు మైనస్ అయ్యింది. టైటిల్ కి దగ్గరవుతున్న సమయంలో తనూజ తన గ్రాఫ్ ని తనే తగ్గించుకుంటుంది అనే మాట గట్టిగా వినబడుతుంది.