Advertisement
Google Ads BL

అతిదీరావ్ హైద‌రీ పేరుతో వాట్సాప్ మోసం


అతిదీరావ్ హైద‌రీ అంద‌చందాలు న‌ట‌ప్ర‌తిభ ఎప్పుడూ యువ‌త‌రం హృదయాల‌ను స్ప‌ర్శిస్తూనే ఉన్నాయి. సౌత్- నార్త్ లో చెప్పుకోద‌గ్గ చిత్రాల‌లో న‌టించిన అదితీరావ్ దేశ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ని ఆస్వాధిస్తోంది. నేటిత‌రంలో అత్యంత ప్ర‌తిభావంత‌మైన న‌టిగా అదితీ వెలిగిపోతోంది. 2024లో త‌మిళ హీరో సిద్ధార్థ్ ని అదితీ రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

Advertisement
CJ Advs

ఇటీవ‌ల సిధ్ తో అదితీ అన్యోన్య‌దాంప‌త్యం గురించి అభిమానులు ఇన్ స్ప‌యిరింగ్ గా మాట్లాడుకుంటున్నారు. మ‌రోవైపు సినీకెరీర్ ప‌రంగాను వ‌రుస చిత్రాల‌తో అదితీ బిజీగా ఉంది. ఇంత‌లోనే ఇప్పుడు అదితీరావ్ హైద‌రీ ఫిర్యాదు హాట్ టాపిగ్గా మారింది. త‌న పేరు చెబుతూ ఒక‌రు వాట్సాప్ నంబ‌ర్ ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, ఈ ఫేక్ వ్య‌క్తిని న‌మ్మొద్ద‌ని హెచ్చ‌రించారు అదితీ.  కొన్ని ఫోటోషూట్ల‌ను అతడు ఫోటోగ్రాఫ‌ర్ల‌కు షేర్ చేస్తున్నాడని కూడా అదితీ అన్నారు. 

అత‌డు ఎవ‌రో నాలాగా న‌టిస్తున్నాడు. అత‌డికి దూరంగా ఉండండి.. ఏదైనా వింత‌గా అనిపిస్తే నా టీమ్ కి చెప్పండి. నేను ఎప్పుడూ ఇలా వ్య‌క్తిగ‌త నంబ‌ర్ నుంచి ఎవ‌రినీ ప‌ని అడ‌గ‌ను! అని కూడా చెప్పారు అదితీ. అయితే మీలాగా గ‌జ‌గామిని న‌డ‌క‌లు (హీరామండిలో అదితీ న‌డ‌క‌ల వీడియో వైర‌ల్ అయింది) ఎవ‌రికీ సాధ్యం కాద‌ని న‌టి కుషా క‌పిల స‌ర‌దాగా ప‌రిహాసం ఆడారు. డిపి ఉంచినంత మాత్రాన అదితీ కాలేర‌ని, ఫేకింగ్ చేయ‌డం కుద‌ర‌ద‌ని కూడా వ్యాఖ్యానించారు.

Aditi Rao Alerts Fans About Imposter Texting Photographers:

Aditi Rao Hydari warns fans against WhatsApp impersonator messaging for photo shoots
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs