దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో చేస్తున్న సినిమా విషయంలో నిన్నటివరకు ఎంత సీక్రేట్ ని మైంటైన్ చేసారో అందరికి తెలుసు. ఎప్పుడో జనవరిలోనే సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన SSMB 29 అప్ డేట్ వచ్చేసరికి 11 నెలలు సమయం పట్టింది. అన్ని నెలలుగా మహేష్ అభిమానులు ఎదురు చూడని రోజు లేదు.
నిన్న శనివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీ వేదికగా మహేష్ మూవీ టైటిల్ వారణాసి గ్లింప్స్ ని ఆయన ఫస్ట్ లుక్ ని ఓ విజువల్ వీడియో ద్వారా #GlobeTrotter ఈవెంట్ లో వదిలారు. అయితే ఆ వీడియో కోసమే అప్ డేట్ ఇవ్వడం అంత లేట్ అయినట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టాక మార్చి లో వీడియో అప్ డేట్ ఇద్దాం అనుకున్నాం, తర్వాత జూన్ అనుకున్నాం కానీ ఈ వీడియో రాలేదు, ఆగష్టు అనుకున్నాం అప్పుడూ రాలేదు.. ఫైనల్ గా ఇప్పుడొచ్చింది అంటూ రాజమౌళి వారణాసి విజువల్ వీడియో రావడానికి ఇన్ని నెలల సమయం పట్టింది అంటూ అప్ డేట్ డిలే పై క్లారిటీ ఇచ్చారు.
అటు యాంకర్ సుమ కూడా నా డేట్స్ మార్చ్ అన్నారు, జూన్ అన్నారు, జులై అన్నారు అంటూ చెప్పుకొచ్చింది. మరి ఒక్క మూడు నిమిషాల వీడియోకే ఇన్ని నెలల సమయం అంటే మూడు గంటల సినిమాకి ఎన్నేళ్లు తీసుకుంటారు జక్కన్నా, 2027 సమ్మర్ అంటున్నారు అయ్యే పనేనా అంటూ సరదాగా నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.