బిగ్ బాస్ సీజన్ 9 లో అప్పుడప్పుడు అంటే ప్రత్యేకంగా శ్రీజ ఎలిమినేషన్, నిన్న శనివారం ఎలిమినేట్ అయిన నిఖిల్ ఎలిమినేషన్ విషయంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. శ్రీజ ఎలిమినేషన్ పై సోషల్ మీడియా భగ్గుమంది, ఆమె ఎలిమినేషన్ ఫేక్ అంటూ ఆమె అభిమానులే కాదు బిగ్ బాస్ ఆడియన్స్ కూడా అన్నారు.
ఇప్పుడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా నిఖిల్ ని శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. అసలు నిఖిల్ డేంజర్ జోన్ లో లేడు. ఈ వారం పోలింగ్ లో నిఖిల్, దివ్య, గౌరవ్ బాటమ్ లైన్ లో ఉన్నారు. వీరిలో దివ్య, గౌరవ్ లు మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారు. నిఖిల్ కన్నా దివ్య కి ఓట్లు తక్కువ వచ్చాయి. బిగ్ బాస్ ఓటింగ్ ఏమో కానీ ఎవరికి వాళ్ళు పర్సనల్ గా పెట్టుకున్న ఓటింగ్ లో దివ్య కు గౌరవ్ కి తక్కువ ఓట్లు పడ్డాయి.
దివ్యపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఉంది. తనూజ ను ఆమె టార్గెట్ చెయ్యడం, భరణి ని బంక లా పట్టుకుని వేలాడడంతో ఆమె గ్రాఫ్ పడిపోయి ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే మెరుగ్గా ఉన్న నిఖిల్ ని ఎలిమినేట్ చెయ్యడం, తర్వాత గౌరవ్ ని ఎలిమినేట్ చెయ్యడం పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి.