గత కొన్ని రోజులుగా SSMB 29 అప్ డేట్ ని #GlobeTrotter ఈవెంట్ లో రివీల్ చేస్తున్నామంటూ దర్శకుడు రాజమౌళి హైప్ ఎక్కిస్తూ వచ్చారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో #GlobeTrotter ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసి మూవీ టీమ్ అంతా కళకళలాడుతూ ఈవెంట్ కి హాజరవగా వేలాదిగా అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఎగబడ్డారు.
మహేష్ తో రాజమౌళి చేస్తున్న మూవీ టైటిల్ గ్లింప్స్ ని మహేష్ తో లుక్ తో సహా రివీల్ చేసారు. ఈ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ గా కళ్ళు చెదిరేలా ముఖ్యంగా హాలీవుడ్ మీడియా కూడా మాట్లాడుకునేలా ప్లాన్ చేసారు. రాజమౌళి ఇంకా ఆయన ఫ్యామిలీ ఓ ఈవెంట్ మేనేజర్లు లా కష్టపడ్డారు.
కానీ GlobeTrotter ఈవెంట్ ఓవర్ హైప్ ముందు తేలిపోయింది. కారణం టెక్నీకల్ ఇష్యుస్, పని చెయ్యని మైక్స్, సరైన సమయానికి టైటిల్ గ్లింప్స్ వెయ్యలేకపోవడం, దానికి కారణం టెస్టింగ్ చేద్దామని ముందు రోజు నైట్ ప్లాన్ చెయ్యగా ఎవరో డ్రోన్స్ తో మా ట్రయిల్ వెర్షన్ ని షూట్ చేసేందుకు చూసారు,
ఆ లీకులతో అభిమానులను డిజప్పాయింట్ చెయ్యలేక డైరెక్ట్ గా ఇక్కడే ఇప్పుడే టెస్ట్ చేసాము, కానీ లైటింగ్, స్క్రీన్ కి పవర్ సరిపోక టెక్నీకల్ ఇష్యుస్ తో మిమ్మల్ని నిరాశపరిచమంటూ రాజమౌళి చెప్పడం, అప్పటికే ఫ్యాన్స్ లో అయోమయం అన్ని ఈవెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణమయ్యాయి.
మరోపక్క వారణాసి గ్లింప్స్ లో రాజమౌళి మార్క్ లేదు. ఫ్యాన్స్ ఏదో గొప్పగా expect చేశారు. వాటిని రీచ్ అవలేదు.. అంటూ సోషల్ మీడియాలో వారణాసి గ్లింప్స్ పై ట్రోల్స్ ఇవన్నీ GlobeTrotter ఈవెంట్ తేలిపోవడానికి కారణమయ్యాయి.