Advertisement
Google Ads BL

అన్న‌ద‌మ్ముల గొడ‌వ‌ల‌లో డైరెక్ట‌ర్ పాత్ర‌


దశాబ్ధాలుగా `విశేష్ ఫిలింస్`లో ఎన్నో విజ‌య‌వంతమైన సినిమాల‌ను నిర్మించారు మ‌హేష్ భ‌ట్- ముఖేష్ భ‌ట్ సోద‌రులు. కానీ 2021లో ఆషిఖి 3 ని ప్రారంభించాక అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. స‌డెన్ గా ముఖేష్ భట్ ఈ బ్యాన‌ర్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌డంతో మ‌హేష్ భ‌ట్ దాని నుంచి త‌ప్పుకున్నారు.

Advertisement
CJ Advs

అయితే అన్న‌ద‌మ్ములు ఇలా బ్రేక‌ప్ అయిపోవ‌డానికి కార‌ణాలేమిటో ఎవ‌రికీ అర్థం కాలేదు. ఆ త‌ర్వాత ఆషిఖి 3ని త‌న బ్యాన‌ర్ లో ప్రారంభిస్తున్నాన‌ని ముఖేష్ భ‌ట్ ప్ర‌క‌టించారు. ఆషిఖి, ఆషిఖి 2 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించాక‌, ఈ బ్యాన‌ర్ కి మాత్ర‌మే ఆషిఖి 3 రైట్స్ ద‌క్కుతాయ‌ని ముఖేష్ భ‌ట్ వాదించారు.

అయితే అన్న‌ద‌మ్ముల గొడ‌వ‌ల్లోకి ప్ర‌వేశించిన‌ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ ఇద్ద‌రి మ‌ధ్యా వివాదాన్ని మ‌రింత పెద్ద‌ది చేసాడు. దీనిపై ముఖేష్ భ‌ట్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ .. త‌మ మ‌ధ్య గొడ‌వ‌లు పెంచింది బ‌య‌టి వ్య‌క్తులు మాత్ర‌మేన‌ని, మా మ‌ధ్య ఎలాంటి విభేధాలు లేవ‌ని మ‌హేష్ భ‌ట్ అన్నారు. అత‌డి వ్యాఖ్య‌లు విక్ర‌మ్ భ‌ట్ ఇన్వాల్వ్ మెంట్ ని హైలైట్ చేసాయి. ఎవ‌రూ త‌మ మ‌ధ్య ప్ర‌వేశించ‌కూడ‌ద‌ని ముఖేష్ భ‌ట్ సున్నితంగానే హెచ్చ‌రించారు. ఇక ఈ గొడ‌వ‌ల కార‌ణంగానే మ‌హేష్ భ‌ట్ త‌న కుమార్తె ఆలియా భ‌ట్ - ర‌ణ‌బీర్ ల పెళ్లికి పిలవ‌లేద‌ని కూడా ముఖేష్ భ‌ట్ త‌న విచారాన్ని వ్య‌క్తం చేసారు. 

తాను ఆలియా- షాహిన్ భ‌ట్ ల‌ను ఎంత‌గానో ప్రేమిస్తాన‌ని, నా భేటీ పెళ్లికి పిల‌వ‌లేద‌ని ఆవేద‌న చెందారు. ఆలియా గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు, బిడ్డ రాహాను క‌న్న‌ప్పుడు త‌న‌ను ప‌రామ‌ర్శించాల‌ని అనుకున్నాన‌ని కానీ కుటుంబంలో ఉద్రిక్త‌త‌లు, ఎమోష‌న్స్ వ‌ద్ద‌నుకున్నాను అని ముఖేష్ భ‌ట్ అన్నారు. ప్ర‌స్తుతం అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరిని ముఖేష్ భ‌ట్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్య‌న్- శ్రీ‌లీల ఈ చిత్రంలో జంట‌గా న‌టిస్తున్నారు.

Mahesh Bhatt brother Mukesh Bhatt recalls feeling bad :

Mahesh Bhatt brother Mukesh Bhatt recalls feeling bad for not being invited for Alia Bhatt wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs