రాజమౌళి - మహేష్ మూవీ టైటిల్ రివీల్ అయ్యింది. వారణాసి గా మహేష్ బాబు పవర్ ఫుల్ లుక్ వదిలిన రాజమౌళి అండ్ టీమ్ #GlobeTrotter ఈవెంట్ కోసం చేసిన ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. వెలాది అభిమానుల నడుమ మహేష్ లుక్ తో పాటుగా వారణాసి టైటిల్ గ్లింప్స్ రివీల్ అవ్వడమే కాదు ఈ ఈవెంట్ లో కీరవాణి, ఇంకా రాజమౌళి తండ్రి గారు విజయేంద్ర ప్రసాద్ గారు ఈ వారణాసి కి సంబందించిన కొత్త కొత్త అప్ డేట్స్ రివీల్ చేసారు.
వారణాసి 2027 సమ్మర్ రిలీజ్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రివీల్ చెయ్యగా.. ఈ సినిమాలో ఒక యాక్షన్ 30 నిమిషాల లెంగ్త్ ఉంది.. మహేష్ బాబు తాలుకూ విశ్వరూపం అలా చూస్తుండిపోయా. డబ్బింగ్ లేదు.. సీజీ లేదు..రీ రికార్డింగ్ లేదు.. అయినా సరే.. మంత్ర ముగ్థుల్ని చేసేసింది. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని సినిమాలు దేవతలు చేయించుకొంటారు.. అంటూ రాజమౌళి ఫాదర్, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు వారణాసి యాక్షన్ సీక్వెన్స్ పై విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు.