#GlobeTrotter ఈవెంట్ ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్న పేరు. రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి నిర్వహిస్తున్న #GlobeTrotter ఈవెంట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవుతుంది. ఈవెంట్ కి గెస్ట్ లు ఎవరు, మహేష్, ప్రియాంక, పృథ్వీ రాజ్ ఎలా కనిపిస్తారు అనే అతృతతో అభిమానులు ఈరోజు 2 గంటల నుంచే రామోజీ ఫిలిం సిటీకి క్యూ కట్టారు.
#GlobeTrotter ఈవెంట్ కి మహేష్ వైఫ్ నమ్రత, ఆయన కుమార్తె సితారలు ట్రెడిషనల్ గా ఈ #GlobeTrotter కి రాగా.. హీరోయిన్ ప్రియాంక చోప్రా చాలా క్యూట్ గా రెడీ అయ్యి తెలుగు ఆడియన్స్ కి కనువిందు చేసింది. పృథ్వీ రాజ్ ఆయన వైఫ్ సుప్రియ లు క్లాసీగా ఈ ఈవెంట్ కి ఎంటర్ అవ్వగా.. మహేష్ మాత్రం రాజమౌళి SSMB29 లో ఎలా కనిపిస్తారో ఆ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు.
#GlobeTrotter ఈవెంట్ లో అభిమానులు వేలాదిగా కేరింతలు కొడుతుంటే.. ఆ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక SSMB 29 టైటిల్ #GlobeTrotter ఈవెంట్ లో రివీల్ చేసారు. ఈ చిత్రానికి వారణాసి టైటిల్ ని ఫిక్స్ చేసి గ్లింప్స్ తో పాటుగా మహేష్ లుక్ ని రివీల్ చేసారు. వారరణాసి టైటిల్ అనేది ఇండియా వైడ్ గా పర్ఫెక్ట్ గా పవర్ ఫుల్ గా కనెక్ట్ అవుతుంది.
ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ లో దించుతున్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రివీల్ చేసేసారు. వారణాసి గ్లింప్స్ లో మహేష్ శివుడి మాదిరి గా నంది మీద వచ్చినట్టుగా రావడం వారణాసి గ్లింప్స్ కి హైలెట్. ఒక ఈవెంట్ ని ఇంతలా చెయ్యొచ్చా అనే విధంగా రాజమౌళి ఇండియాలోనే కనివిని ఎరుగని రీతిలో #GlobeTrotter ఈవెంట్ ని డిజైన్ చేసిన తీరుకు ఇంటర్నేషనల్ మీడియా తో పాటుగా ప్రపంచ వ్యాప్త మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు.