బిగ్ బాస్ 9 సీజన్ లో ఈ వారం మరో డబుల్ ఎలిమినేషన్ కు తెర తీశారు యాజమాన్యం. గతంలో ఫ్లోరా మరియు శ్రీజ ని డబుల్ ఎలిమినేషన్ లో పంపించేశారు. ఆతర్వాత మళ్లీ అయేషా హెల్త్ రీజన్స్ తో వెళ్లిపోగా అదే వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. గత వారం రాము రాధోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా అదే వారం సాయి శ్రీనివాస్ ను అఫీషియల్ గా ఎలిమినేట్ చేసారు.
మళ్లీ ఈవారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన అయేషా హెల్త్ రీజన్స్ తో వెళ్లిపోగా.. ఆతర్వాత రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది, ఆతర్వాత మాధురి హౌస్ ని వీడింది. గత వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఇంకా హౌస్ లో మిగిలిన మరో రెండు వైల్డ్ కార్డులు నిఖిల్, గౌరవ్ లను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న నిఖిల్ గౌరవ్ ఇద్దరూ హౌస్ లో టాస్క్ పెరఫార్మెన్స్ బాగా చేసినా మిగతా విషయాలంటే హౌస్ మేట్స్ తో మింగిల్ అవ్వకపోవడం, సైలెంట్ గా ఉండడం ఆడియన్స్ కు అస్సలు నచ్చలేదు. అందుఎక్ ఓట్లు వెయ్యలేదు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. ఈ శనివారం ఎపిసోడ్‌లో నిఖిల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక రేపు ఆదివారం ఎపిసోడ్ లో గౌరవ్ ని ఎలిమినేట్ చేసినట్లుగా లీకులు చెబుతున్నాయి. దానితో ఫైర్ స్ట్రొమ్ అంటూ వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చి అంతే స్పీడుగా వారానికొకరు ఎలిమినేట్ అయ్యి వైల్డ్ కార్డ్స్ మొత్తం హౌస్ నుంచి వెళ్లిపోయారు.