బిగ్ బాస్ ముద్దుబిడ్డ, నాగార్జున మెచ్చిన కంటెస్టెంట్ అంటూ తనూజ ని సోషల్ మీడియాలో మీమ్స్ వేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. తనూజ తప్పులను బిగ్ బాస్ పట్టించుకోడు, నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తనూజ కు మంచి చెబుతారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు కనిపిస్తున్నాయి. నాగార్జన కూడా కొన్నిసార్లు హోస్ట్ లా కాకుండా తనూజ ని ఇష్టపడని వారు కూడా ఉంటారా అంటూ డైలాగ్స్ వెయ్యడం, అన్ని తనూజ పై కొంతమంది లో నెగెటివ్ పెరిగేలా చేసింది.
మరి బిగ్ బాస్ ముద్దుబిడ్డ, నాగార్జున కి ఇష్టమైన కంటెస్టెంట్ తనూజ కి ఈ వారం క్లాస్ గ్యారెంటీ, డిమోన్ పవన్ విషయంలో మ్యాన్ హ్యాండలింగ్ అంటూ తనూజ నోరు జారింది అనుకున్నారు. అదే నిజమైంది. ఈ శనివారం ఎపిసోడ్ లో తనూజ కి నాగార్జున ఫుల్ క్లాస్ ఇచ్చారు. ఇక్కడ జెండర్ లేదు, అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేదు.
నిను జస్ట్ పుష్ చేసిన డిమోన్ పవన్ ని అలా ఎందుకన్నావ్ అని నాగ్ అంటే తర్వాత తోస్తాడేమో అంది తనూజ, మరైతే ఓ వీడియో చూపిస్తా అంటూ తనూజ ఆటలో డిమోన్ పవన్ ని పుష్ చేసిన వీడియో చేసి చూపించారు. నిఖిల్ నువ్వు తాక గానే తనూజ నిన్ను కూడా మ్యాన్ హ్యాండలింగ్ అందిగా అంటే నేను హార్ట్ అయ్యా కానీ పవన్ పర్సనల్ గా ఫీలయ్యాడు అన్నాడు నిఖిల్.
ఒక వారం తప్పు చేసాడని పవన్ ని అదే గాడి లో వెయ్యలేం కదా అంటూ తనూజ ని ఎడా పెడా వాయించిన ప్రోమో ని వదిలారు స్టార్ మా వాళ్ళు.