పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఆయన సెలెక్ట్ చేసుకునే దర్శకుల విషయంలో ఆయన అభిమానులు అప్పుడప్పుడు షాకవుతున్నారు. గతంలో ఆదిపురుష్ అప్పుడు ఓం రౌత్ విషయంలో, రాజా సాబ్ అప్పుడు మారుతి విషయంలో ప్రభాస్ నిర్ణయాన్ని అభిమానులు తప్పుపట్టలేక నలిగిపోయారు.
అయినప్పటికీ ప్రభాస్ తన లైనప్ లోకి షాకిచ్చే దర్శకులను తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేసేసి ఫౌజీ షూటింగ్ ఫినిష్ చెసే పనిలో ఉండడమే కాదు ఈ నెల చివరిలో ఆయన క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగ మూవీ స్పిరిట్ సెట్ లోకి అడుగుపెడతారు అని సమాచారం.
ఆతర్వాత ప్రభాస్ సలార్ 2, కల్కి 2 తో పాటుగా ఆయన లైనప్ లో ప్రశాంత్ వర్మ కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ దర్శకుల లైనప్ లోకి కొరియోగ్రాఫర్ చేరారు. ఆయనే టాప్ డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్. ప్రేమ్ రక్షిత్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
రాజా సాబ్ షూటింగ్ సమయంలో ప్రేమ్ రక్షిత్ ప్రభాస్ కి ఓ స్టోరీ లైన్ వినిపించగా అది ప్రభాస్ కి నచ్చేసి ప్రేమ్ రక్షిత్ కి ఓకే చెప్పేశారని అంటున్నారు.