బిగ్ బాస్ సీజన్ 9 పదో వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ టార్గెట్ చేసిన రీతూ, దివ్య, నిఖిల్, గౌరవ్, భరణి, సంజన మాత్రమే కాకుండా మిగతా హౌస్ మేట్స్ ని ఇంక్లూడింగ్ కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ని కూడా బిగ్ బాస్ నామినేట్ చేసారు. కానీ ఇమ్మాన్యుయేల్ ని హౌస్ మేట్స్ సేవ్ చేసారు. ఈ వారం ఇచ్చిన టాస్క్ లో గెలిస్తే అటు నామినేషన్స్ నుంచి ఒకరు సేవ్ అవడమే కాదు ఇటు కెప్టెన్ అయ్యే ఛాన్స్ పొందుతారని చెప్పాడు బిగ్ బాస్.
ఈవారం టాస్క్ లో ఎవరికి వారే గెలవాలనే కసితో ఆడుతున్నారు. అయితే నామినేషన్స్ లో ఉన్న అందరిలో ఈ వారం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో క్యూరియాసిటీ మొదలయ్యింది. ఈ వారం టాస్క్ లు గెలిచి తనూజ కెప్టెన్ అయ్యింది. ఇక నామినేషన్స్ లోకి వస్తే ఎప్పుడు జోరు చూపించే తనూజ కు పడాల కళ్యాణ్ షాకిస్తున్నాడు. సోమవారం కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. కారణం శ్రీజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరూ కళ్యాణ్ కి గుద్దేస్తున్నారు.
దానితో కళ్యాణ్ తనూజ కి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. కానీ తనూజ ఈ వారం కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ పొందింది. ఇక ఆతర్వాత సుమన్ శెట్టి అనూహ్యంగా మూడో స్థానంలోకి వచ్చేసాడు. భరణి తన ఆటను, రాంక్ ని మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి వచ్చేసాడు. ఆతర్వాత టాప్ 5లోకి రీతూ కూడా ఎంటర్ అయ్యింది.
ఈ వారం సంజన, పవన్, దివ్య, నిఖిల్, గౌరవ్ లు తమ తమ స్థానాల్లో డేంజర్ జోన్ కి దగ్గరగా ఉన్నారు. మరి ఈ వారం టాస్క్ ల్లో తమ తమ పెరఫార్మెన్స్ ను బట్టి కూడా తమ ర్యాంక్ ని మెరుగుపరుచుకునే ఛాన్స్ వచ్చింది. కానీ చివరిగా నిఖిల్, దివ్యలు డేంజర్ జోన్ లో కొనసాగుతున్నారు. ఈ వారం వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.