జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ వెనుకుండి నడిపిస్తూ(ఫామ్ హౌస్ ) లో కూర్చుని కొడుకు కేటీఆర్ కి బాధ్యతలు అప్పజెప్పారు. మాగంటి గోపినాధ్ రెండో భార్య సునీత ని రంగంలోకి దించి కేటీఆర్, హరీష్ రావు లు ముందుండి నడిపించారు. మధ్యలో హారిష్ రావు తండ్రిగారు మరణించడంతో ఆయన కొన్నాళ్ళు ప్రజల్లో కనిపించలేదు.
కేటీఆర్ రోడ్ షోస్, మీటింగ్స్ అంటూ తెగ హడావిడి చేసారు. కానీ జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కేటీఆర్ కాంగ్రెస్ కి అప్పజెప్పారు. అక్కడ జూబ్లీహిల్స్ లో ఓడిపోయింది సునీత కాదు, కేటీఆర్ ఓడిపోయారు. ఆయనే ఈ ఓటమి బాధ్యత తీసుకోవాలి అంటూ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఈఓటమి మాగంటి ఫ్యామిలీది కాదు కేటీఆర్ ది అంటున్నారు. నిజమే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్టింగ్ స్తానం కోసం పోరాడి ఓడిపోయింది BRS పార్టీ.
రేవంత్ రెడ్డి రాజకీయం, ఈ స్తానం గెలుపు కోసం కాంగ్రెస్ హేమాహేమీలు రంగంలోకి దిగడం, రేవంత్ రెడ్డి మీటింగ్స్, రోడ్ షోస్.. నవీన్ యాదవ్ ని గెలిపించాయనడంలో సందేహమే లేదు.