జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25వేల ఓట్ల మెజార్టీతో ఘాన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బిజెపి అస్సలు ప్రభావం చూపలేక డిపాజిట్ కోల్పోయింది.
ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కొద్దిపాటి ఆధిక్యత చూపించినా ఆ తర్వాత రెండో రౌండ్ నుంచి నవీన్ యాదవ్ మెజారిటీలోకి వచ్చేయడమే కాదు రౌండ్ రౌండ్ కి పూర్తి ఆధిక్యత చూపిస్తూ చివరి రౌండ్ వరకు అదే ఆధిక్యతతో భారీ మెజారిటీ ని సొంతం చేసుకున్నారు. దానితో విజయసంబరాల్లో మునిగితేలుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు..
రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో విజయ్ సాధించినా హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్యెల్యే కూడా లేకపోవడం లోటుగానే కనిపించింది. దానితో ఈ ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రుల తో కలిసి జూబ్లీహిల్స్ ప్రజల ముందుకు వచ్చి ప్రచారం చేసారు. ఈ ఎన్నికలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రతి ఒక్క విషయాన్ని సీరియస్ గా తీసుకుని కష్టపడి పని చేసి పూర్తి మెజారిటీతో జూబ్లీహిల్స్ స్థానని కైవసం చేసుకుంది.