గతంలో మాగంటి గోపినాధ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేత, తెలంగాణ సపరేట్ అయ్యాక టీడీపీ కనుమరుగైనప్పటికీ టీడీపీ ఓట్లన్నీ టీడీపీ నుంచి బీఆర్ ఎస్ లోకి వెళ్లిన నేతలకే వేశారు టీడీపీ అభిమానులు. కానీ ఈసారి టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడ్డాయి. గత ఎన్నికల్లో హైదెరాబాదు పరిసర ప్రాంత ప్రజలు ఎప్పటిలాగే బిఆర్ఎస్ లో ఉన్న టీడీపీ నేతలకు గుద్ది పారేసారు.
అందుకే కాంగ్రెస్ తెలంగాణ మొత్తంగా గెలిచినా హైదరాబాద్ సిటీలో పట్టు కోల్పోయింది. బీఆర్ఎస్ హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వలేదు. తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మరి రేవంత్ రెడ్డి పై టీడీపీ అభిమానుల్లో ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. ఆయన టీడీపీ లో స్ట్రాంగ్ కాండిడేట్ గా కనిపించేవారు. అందుకే టీడీపీ అభిమానులు రేవంత్ రెడ్డి ని ఇప్పటికి సపోర్ట్ చేస్తున్నారు.
దానికి నిదర్శనమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. మాగంటి గోపినాధ్ మరణం ఆయన రెండో భార్య సునీత కి సింపతీ క్రియేట్ చేస్తుంది, హైదరాబాద్ లో మనకు స్ట్రాంగ్ సపోర్టు ఉంది, మనదే గెలుపు అని విర్రవీగిన కేటీఆర్, హరీష్ రావు లకు జూబ్లీహిల్స్ ప్రజలు చుక్కలు చూపించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం సాధించి తమకు హైదరాబాద్ ప్రజల్లో కూడా సపోర్ట్ ఉంది అని రేవంత్ రెడ్డి నిరూపించారు.
అయితే జూబ్లీహిల్స్ లో టీడీపీ అభిమానుల ఓట్లన్నీ నవీన్ యాదవ్ కే పడ్డాయి. అక్కడ కాండిడేట్ ఎవరు అనేది పక్కనపెట్టి మరీ రేవంత్ రెడ్డి కోసమే నవీన్ యాదవ్ కి ఓటేశారు జూబ్లీహిల్స్ టీడీపీ అభిమానులు. గోపినాధ్ భార్య ను కూడా పట్టించుకోకుండా నవీన్ యాదవ్ కి ఓటేసి ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించారు జూబ్లీహిల్స్ టీడీపీ ప్రజలు.