Advertisement
Google Ads BL

అక్కడ సీఎం పూజ - ఇక్కడ నవీన్ సంబరాలు


జూబ్లీహిల్స్ బై పోల్స్ లో గెలుపు దిశగా కాంగ్రెస్ పరుగులు పెడుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినా హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ గెలిచి హైదరాబాద్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో మాదే అని విర్రవీగింది. కాంగ్రెస్ కి హైడ్రా మైనస్, ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు అనుకున్న వాళ్లకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్ చెంపపెట్టు అన్నట్టుగా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కి మెజారిటీ తీర్పు అందించారు. 

Advertisement
CJ Advs

కాంగ్రెస్ పార్టీ కాండిడేట్ నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖాయమైంది. ప్రతి రౌండ్ లోను కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. రౌండ్ రౌండ్ కి కాంగ్రెస్ లీడ్ లోకొచ్చేస్తుంది. దానితో హైదరాబాద్ గాంధీ భవన్ లో సంబరాలు మొదలైపోయాయి. మరోపక్క ఈ జూబ్లీహిల్స్ సీటు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రోడ్ షో చేసారు. 

నేడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కౌంటింగ్ రోజు రేవంత్ రెడ్డి ఇంట్లో లక్షి పూజ నిర్వహించారు. అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో లక్ష్మీదేవి పూజ జరుగుతుంటే ఇక్కడ గాంధీ భవన్‌లో సంబరాలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ కనిపించడంతో ఆయన గెలుగు ఖాయమైంది అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్ లో సంబరాలు చేసుకుంటున్నారు. 

Jubilee Hills by election vote counting:

Jubilee Hills by election results - Congress takes lead 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs