Advertisement
Google Ads BL

రజిని-కమల్ కి హోల్సేల్ షాక్


సూపర్ స్టార్ రజినీకాంత్ తో కమల్ హాసన్ నిర్మించి నటించనున్న #Thalaivar173 కి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లుగా కమల్ హాసన్ బర్త్ డే రోజున అనౌన్స్ చేశారు. రజినీకాంత్, కమల్ హాసన్, సుందర్ సి లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులను కనువిందు చేసారు. కమల్-రజిని సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోవడం చాలా అరుదు కాబట్టే ఈ బడా మల్టీస్టారర్ పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. 

Advertisement
CJ Advs

అయితే #Thalaivar173 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంటుంది అనుకున్న అభిమానులకు బిగ్ షాక్ తగిలే న్యూస్ బయటికి వచ్చింది. అదే దర్శకుడు సుందర్ సి ఈ #Thalaivar173 ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఓ ప్రెస్ నోట్ వదలడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

అనుకోని పరిస్థితుల వల్ల #Thalaivar173 నుండి తప్పుకుంటున్నాను, ఈ నిర్ణయం చాలా భారమైనది, బాధాకరమైంది, రజనీకాంత్ గారి లాంటి లెజెండరీ నటుడితో, కమల్ హాసన్ గారి నిర్మాణంలో సినిమా చేయడం నా డ్రీమ్ ఫుల్ ఫీల్ అయినట్లే. కానీ లైఫ్ మనల్ని ఎప్పుడో ఒక మార్గంలో నడిపిస్తుంది. ఈ ఇద్దరు ఐకాన్లతో నా బంధం చాలా కాలం నాటిది. మా మధ్య కొద్ది రోజుల క్రితమే మొదలైన ఈ ప్రయాణం, ప్రత్యేక క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను. 

వారిద్దరి నుంచి నేర్చుకున్న పాఠాలు అమూల్యం. ఈ అవకాశాన్ని కోల్పోతున్నా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ అప్‌డేట్‌తో అభిమానులు నిరాశ చెందితే హృదయపూర్వక క్షమాపణలు. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి కట్టుబడి ఉంటాను అంటూ సుందర్ సి చెప్పుకొచ్చారు. 

అయితే సుందర్ సి ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని వదిలేసారు, ఇకపై ఈ మల్టీస్టారర్ ని ఏ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తారు అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. 

Director Parted Ways From Thalaivar 173:

Sundar C Announces Exit from Rajinikanth Kamal Haasan Film Thalaivar 173
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs