గత ఎనిమిది నెలలుగా మహేష్ SSMB 29 అప్ డేట్ కోసం ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. మహేష్ అభిమానులు రాజమౌళి ఇవ్వబోయే అప్ డేట్ కోసం ఎదురు చూడని రోజు లేదు కానీ నవంబర్ లోనే SSMB 29 అప్ డేట్ అంటూ ఊరించిన అందుకు తగ్గట్టుగానే రాజమౌళి కళ్ళు చెదిరే రేంజ్ లో హాలీవుడ్ అవాక్కయ్యే లెవల్లో ఈ #GlobeTrotter ఈవెంట్ ప్లాన్ చేసారు.
కానీ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. దానికి ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఒక కారణమైతే, ఈమధ్యన జనాలు తొక్కిసలాటకు గురవడం మరో కారణం. అందుకే #GlobeTrotter ఈవెంట్ కు పోలీస్ లు ఫుల్ గా పర్మిషన్ ఇవ్వలేదు. దానితో రాజమౌళి ఓ వీడియో వదిలారు. మీతో పాటు నేను కూడా ఈ ఈవెంట్ కోసం వెయిట్ చూస్తున్నాను, రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ ఈవెంట్‌కు చాలా కండీషన్స్ ఉన్నాయని, ఈ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్ లో జరగడం లేదు అని, ఫిజికల్ పాసెస్ ఉంటే తప్ప వేడుకకు రావద్దంటూ స్ట్రిక్ట్‌గా చెప్పారు.
18 ఏళ్ల లోపు పిల్లలు, సీనియర్ సిటిజన్లకు ఈ ఈవెంట్‌కు రావడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అందుకే వాళ్లు ఇంట్లోనే కూర్చుని ఈవెంట్ ఎంజాయ్ చేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఈవెంట్ క్యాన్సిల్ చేస్తామని కమీషనర్ చెప్పినట్లు రాజమౌళి చెప్పారు.
మరి ఎన్నాళ్ళుగానో ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు రాజమౌళి వీడియో నిరాశనే కలిగించింది. మరి ఇది ఎవరి బ్యాడ్ లక్. అక్షరాలా అభిమానుల బ్యాడ్ లక్ అనే చెప్పాలి.