బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉందనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ ఫారియా తో జాన్వీ కపూర్ స్నేహంగానే కాదు డేటింగ్ లోను ఉందనే వార్తలు ఇప్పటివి కావు. శిఖర్ తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడం, అంతేకాకుండా వెకేషన్స్ కి వెళుతుంది జాన్వీ కపూర్.
అలాగే శిఖర్ పహారియాతో కలిసి జాన్వీ కపూర్ బాలీవుడ్ ప్రముఖ ఫ్యామిలీ ఈవెంట్స్ లోని కనిపిస్తుంది. ఇక తమ ఇంట్లో జరిగే దివాళి సెలెబ్రేషన్స్ ను శిఖర్ ఫారియాతో కలిసి చేసుకుంటుంది. కానీ వారి నడుమ డేటింగ్ వార్తలను మాత్రం జాన్వీ కపూర్ ఎప్పుడు కన్ ఫర్మ్ చెయ్యదు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని శిఖర్ పహారియా బిజినెస్ పై ఫోకస్ పెడుతుంటాడు. అయితే తాజాగా జాన్వీ కపూర్ తన లవ్ ని కన్ ఫర్మ్ చేసినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా జాన్వి తండ్రి బోనీ కపూర్ 70వ బర్త్ డే వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలకు కేవలం కపూర్ ఫ్యామిలీ మెంబెర్స్ పాల్గొనగా.. అందులో శిఖర్ పహారియా ఉండడం, జాన్వీ కపూర్ తో క్లోజ్ గా ఉండడంతో అందరూ జాన్వీ కపూర్ తన ప్రేమను ఇలా కన్ ఫర్ చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు.