వచ్చే రెండు రోజుల పాటు విశాఖలో CII సమ్మిట్ జరగబోతుంది. రేపు, ఎల్లుండి విశాఖలో జరగబోయే CII సమ్మిట్ కోసం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు జరుగుతూన్నాయి. దానికోసం మెయిన్ డయాస్ తో పాటు 8 హాళ్లు సిద్ధం చేస్తున్నారు. రేపు మొదలు కాబోయే సమ్మిట్ కోసం ఇప్పటికే అంటే నిన్న రాత్రే సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకున్నారు.
ఇవాళ నోవాటెల్ హోటల్ లో ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ – సస్టైనబుల్ గ్రోత్‌పై ప్రారంభ సెషన్ లో సిఎం పాల్గొంటారు. అంతేకాకుండా తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి.
వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పై జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. సి.ఐ.ఐ నేషనల్ కౌన్సిల్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. ఈ CII సమ్మిట్ ముగింపు అంటే చివరిగా నెట్వర్క్ డిన్నర్‌లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.