యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ సినిమాల్తోనే కాదు రిబ్బన్ కటింగ్స్ తోనూ తెగ సంపాదిస్తుంది. ఇండస్ట్రీలో పెద్దగా స్నేహితులు లేని అనసూయ ఎక్కువగా ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ చేస్తుంది. జబర్దస్త్ లాంటి షోస్ వలన ఫ్యామిలీతో స్పెండ్ చెయ్యడానికి సమయం చిక్కడం లేదు అంటూ జబర్దస్త్ షో ని వదిలేసింది.
అనసూయ ప్రస్తుతం భర్త భరద్వాజ్, కొడుకులతో కలిసి కెన్యా వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ భర్త తో కలిసి ఎంజాయ్ చెయ్యడమే కాదు, కెన్యా అడవులు అంటే కరూర ఫారెస్ట్ లో నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వాటర్ ఫాల్స్ తో ఆడుకుంటున్న పిక్స్ షేర్ చేసింది. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ భరద్వాజ్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
అయితే అనసూయ ఈ వెకేషన్ కి తన కొడుకులిద్దరిని తీసుకెళ్లినా ఆమె అడవిలోకి మాత్రం భర్త తోనే వెళ్లిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక కెన్యాలోని అరుదైన జంతువులను చూస్తూ అనసూయ కొడుకులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంది.