రీసెంట్ గా దేశ రాజధాని ఢిల్లీ లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ధాటికి 12మంది ప్రాణాలు కోల్పోగా అనేకమంది ఈ బాంబు దాడిలో గాయపడ్డారు. దానితో పలు ప్రధాన నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. అదే సమయంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పేల్చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆఫీస్‌కి బెదిరింపు మెయిల్ రావడం కలకలం సృష్టించింది.
కేవలం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కే కాదు దేశవ్యాప్తంగా ఆరు ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం, గోవా ఎయిర్ పోర్టులు పేల్చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు మెయిల్స్ పంపిన దుండగులు.
ఢిల్లీ ఘటన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించడమే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్టాండ్‌లలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి.