Advertisement
Google Ads BL

దుల్కర్ కాంత పై కోర్టు కేసు


రేపు శుక్రవారం నవంబర్ 14 న దుల్కర్ సల్మాన్ నటించిన కాంత చిత్రం విడుదలకు సిద్ధమైంది. మంచి అంచనాలు అందుకు తగ్గ ప్రమోషన్స్ తో కాంత ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రానా కాంత చిత్రం వెనుక ఉండడం, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కావడమే కాదు సముద్రఖని కీలక పాత్ర పోషించడం, దుల్కర్ సినిమాలు వరసగా బాక్సాఫీసు దగ్గర సక్సెస్ అవడంతో కాంత పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ కనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కాంత పై ఇప్పడు కోర్టు కేసు పడడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా చెన్నై కోర్టులో వేసిన కేసుతో కాంత విడుదల చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ త్యాగరాజ భాగవతార్ మనవడు కోర్టులో పిటిషన్‌ వేశారు. 

దుల్కర్ సల్మాన్ కాంత చిత్రాన్ని దర్శకుడు త్యాగరాజ భాగవతార్ లెజెండ్ కథను కాంత గా తెరపైకి తీసుకువస్తున్నారు. త్యాగరాజ భాగవతార్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈచిత్ర  కథలో చూపిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ త్యాగరాజ భాగవతార్ మనవడు కోర్టుకు వెళ్లారు. 

దానితో కాంత విడుదలపై అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చెన్నై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

Last Minute Hurdle For Kaantha:

MK Thyagaraja Bhagavathar Grandson Files Plea Against Kaantha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs