కోలీవుడ్ లో ఈ మధ్యన బాంబు బెదిరింపుల ట్రెండ్ ఎక్కువైంది. సీఎం స్టాలిన్ ఇల్లు దగ్గరనుంచి గవర్నర్ బంగ్లా, అలాగే నటులు త్రిష ఇలా చాలామంది ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించాయి. ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తయిన తమిళనాడు పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు కూడా.
కానీ అవన్నీ ఫేక్ అని, బాంబు బెదిరింపులు ఆకతాయిల పనే అని పోలీసులు తేల్చేసారు. తాజాగా హీరో అజిత్ కుమార్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. చెన్నై లోని హీరో అజిత్ ఇంట్లో బాంబు పెట్టమంటూ ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు;
అజిత్ ఇంటి తో పాటుగా చెన్నైలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్, ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు బాంబు పెట్టమంటూ ఈ మెయిల్స్ తో బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది. కానీ తనిఖీల్లో అదంతా అబద్దమని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.