మిల్కి బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పుడు ఎలా అయితే నాజుగ్గా, స్లిమ్ గా ఉందొ.. ఇనేళ్లయినా అదే ఫిట్ నెస్ ని మైంటైన్ చేస్తుంది. ప్రస్తుతం కెరీర్ లో ఏదో ఒక సినిమా తోనో, లేదంటే స్పెషల్ సాంగ్ తోనో, లేదు అంటే వెబ్ సీరీస్ లతోనో నిత్యం బిజీగానే కనిపిస్తుంది.
అయితే ఈమధ్యన తమన్నా వెయిట్ తగ్గడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటుంది.. ఆమె అవకాశాలు తగ్గాక బరువు పెరిగింది. అది తగ్గించుకోవడానికి ఆమె ఇంజెక్షన్స్ వాడుతుంది అనే ప్రచారానికి చెక్ పెడుతూ.. అమ్మాయిలు ఎప్పుడు ఒకే రకమయిన బరువుతో కనిపించరు.
నేను చిన్న వయసు అంటే పదిహేనేళ్ల వయసు నుంచే నటిస్తున్నాను, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానని తాను అనుకుంటున్నట్లుగా చెప్పిన తమన్నా సినిమాల్లోని కొన్ని పాత్రల కోసం ఒక్కోసారి బరువు పెరగడం, మరోసారి తగ్గడం చేయాల్సివస్తుంది.
చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను, అప్పటినుంచి తన జర్నీ కెమెరాతోనే.. ఇందులో సీక్రెట్ గా ఉంచడానికి ఏమి లేదు, మహిళలు ఎపుడు ఒకే రకమయిన ఫిట్ నెస్ తో మైంటైన్ చెయ్యలేరు అంటూ తమన్నా తన వెయిట్ పై కామెంట్స్ చేసింది.