ప్రముఖ బాలీవుడ్ నటులు ధర్మేంద్ర అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ధర్మేంద్ర కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై మృతి చెందారంటూ నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో.. ఆయన అభిమానులే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ షాకయ్యారు.
అయితే నటుడు ధర్మేంద్ర బ్రతికే ఉన్నారని ఆయన కుమార్తె ఇషా డియోల్, భార్య సీనియర్ నటీమణి హేమ మాలిని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. మీడియాలో ధర్మేంద్ర మృతిపై వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు... సరైన సమాచారం తెలుసుకోకుండా.. హాస్పిటల్ లో చికిత్సకు స్పందిస్తూ.. ఆరోగ్యం నిలకడగా ఉన్న మహా మనిషికి సంబంధించి వార్తలు వేసే విషయంలో ఇంత ఘోరంగా వ్యవహరించడమేంటని వారు ప్రశ్నించారు..
ఇన్స్టా లో ఇషా మెసేజ్ పెట్టగా.. ఎక్స్ వేదికగా హేమమాలిని మెసేజెస్ పోస్ట్ చేశారు...
కుటుంబ సభ్యులు స్వంతంగా ధర్మేంద్ర బ్రతికే ఉన్నాడని స్పష్టం చేయడంతో జాతీయ మీడియా నాలుక కరుచుకుంది... మరోపక్క కుటుంబ ఆస్తుల వ్యవహారాల నేపథ్యంలోనే ధర్మేంద్ర అస్తమయం ప్రకటనపై జాప్యం చేస్తున్నారని ఒక వర్గం మీడియా చెబుతోంది..!