ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) అనారోగ్య కారణాలతో కన్నుమూసారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ షోలేలో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. ధర్మేంద్ర కన్నుమూత తో బాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ లోని సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి:
శ్రీ ధర్మేంద్ర జీ గారు కేవలం ఒక లెజెండరీ నటుడు మాత్రమే కాదు, ఒక అసామాన్యమైన మనిషి కూడా.
ప్రతి సారి ఆయన్ని కలిసినప్పుడు ఆయనలోని వినమ్రత మరియు ఆప్యాయత నా హృదయాన్ని లోతుగా తాకాయి.
ఆయనతో గడిపిన ఆ స్నేహపూర్వక క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.
ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా నా ప్రియమైన మిత్రులు సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్‌కి నా ప్రగాఢ సానుభూతి..
ఆయన వారసత్వం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర మృతికి చిరు సంతాపం తెలియజేసారు.