ఆర్జీవీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ `శివ` దాదాపు 36 ఏళ్ల తర్వాత 4కేలో డిజిటల్ మాస్టరింగ్ చేసిన వెర్షన్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున, ఆర్జీవీ కెరీర్ లో అరుదైన మైలురాయి చిత్రమిది. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రీరిలీజవుతోంది.
ప్రత్యేక షో వీక్షించిన తర్వాత కింగ్ నాగార్జునకు మీడియా నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి నాగ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. శివ చిత్రాన్ని నాగచైతన్య, అఖిల్ రీమేక్ చేయడానికి ముందుకు రాలేదా? అని ప్రశ్నించగా, అలాంటి ధైర్యం వారికి లేదని నాగార్జున అన్నారు.
రీమాస్టరింగ్ వెర్సన్ చూసిన తర్వాత కొత్త సినిమా చూస్తున్నానా అనిపించింది. అమలతో మరోసారి నటించాలనుందని కూడా నాగ్ అన్నారు. ఇదే వేదికపై నాగార్జునతో సైకిల్ చైన్ సీన్ ఎలా చేయించానో , అతడు దానికి ఎలా అంగీకరించాడో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందని ఆర్జీవీ అన్నారు.