అవును బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ని చూస్తే జాలేస్తుంది. బాహుబలి తో ప్రమోషన్స్ అంటూ ప్రతి భాష ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆతర్వాత నల్లపూసైపోయారు. మీడియా ముందుకురారు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్ప మిగతా ఎలాంటి ఇంటర్వ్యూలో ప్రభాస్ కనిపించరు. ఆయనతో సినిమా చేస్తే చాలు అనుకునే నిర్మాతలు, అవన్నీ పట్టించుకోరు.
ప్రభాస్ తో ఎవరు సినిమా చేసినా.. విడుదల సమయానికి హడావిడిగా రిలీజ్ చెయ్యడం తప్ప ప్రోపర్ ప్రమోషన్స్ ఉండడమే లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏంతో ఊహించుకుని నిర్మాణ సంస్థలను టార్గెట్ చేసినా ప్రభాస్ లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. చాలామంది హీరోల సినిమాలకు ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాపై క్రేజ్ పెంచుతున్నారు.
కానీ ప్రభాస్ సినిమాలకు అలా కాదు. ఎప్పుడో మార్చ్ లో విడుదల కాబోయే రామ్ చరణ్ పెద్ది చిత్ర ఫస్ట్ సింగిల్ ఇప్పుడే విడుదలై రికార్డులని క్రియేట్ చేస్తుంది. కానీ రాజా సాబ్ సింగిల్ జాడ లేదు. అసలు ఎప్పుడు విడుదలో మేకర్స్ చెప్పరు. దానితో అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. సినిమా విడుదలకు రెండు నెలల సమయం ఉన్నా.. ఇతర హీరోల ప్రమోషన్స్ మొదలయ్యే సరికి ప్రభాస్ అభిమానులు ఆందోళన పడుతున్నారు.
మరి ప్రభాస్ ఫ్యాన్స్ ను గత నిర్మాతలు మోసం చేసినట్టే రాజా సాబ్ మేకర్స్ కూడా చెయ్యరు కదా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ప్రభాస్ అభిమానులు మరింత టెన్షన్ పడుతున్నారు.