బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్టుగా ఆట మొత్తం మారిపొయింది. ఈ సీజన్ లో ఇమ్మాన్యుయేల్, తనూజ ట్రోఫీ కి దగ్గరగా వచ్చేసారు. టాప్ 5 కోసం మిగతా కంటెస్టెంట్స్ ఆరాటపడుతున్నారు. అయితే ఇమ్మానుయేల్, తనూజ ఇకపై టాస్క్ లు బాగా ఆడితేనే ట్రోఫీ అందుకుంటారు, దానిని ఆడియన్స్ ఇష్టపడాలి.
అంతేకాదు కళ్యాణ్, ఇంకా సుమన్ శెట్టి లు ఈ ఐదు వారాల ఆట చూస్తే వారు కూడా ట్రోఫీ కి దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఇమ్మానుయేల్ ఇప్పటివరకు నామినేషన్స్ లోకి రాకపోవడం అతనికి ప్లస్ అవుతుందో, లేదంటే మైనస్ అవుతుందో అని భయపడుతున్నాడు. కానీ ఈ వారం నామినేషన్స్ రచ్చ హౌస్ లో మాములుగా లేదు.
హౌస్ మేట్స్ చాలామంది దివ్య ని టార్గెట్ చేసారు. రీతూ అయితే నువ్వు గ్రూప్ కట్టి అందరిని నీ గ్రిప్ లో పెట్టుకుని ఆడుతున్నావ్ అంటే వాళ్లకు లేని బాధ నీకెందుకు అంది దివ్య. రీతూ దివ్య ను నామినేట్ చేసింది. అలాగే భరణి లో ఫైర్ చూడాలంటూ అతను నమ్మినవాళ్ళే భరణిని నామినేషన్స్ లో పెట్టారు.
ఇక ఈ వారం నామినేట్ అయినవాళ్లలో.. నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.