Advertisement
Google Ads BL

BB 9: ఇమ్మాన్యుయెల్ కి గట్టిపోటీనే


బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటివరకు అంటే స్టార్టింగ్ నుంచి ఈ వారం వరకు అసలు నామినేట్ అవ్వని కంటెస్టెంట్ ఎవరు అంటే ఇమ్మాన్యుయెల్ అనే చెప్పాలి. అతని ఆటతీరు, అతని ఎంటర్టైన్మెంట్, హౌస్ మేట్స్ తో ర్యాపో మైంటైన్ చేసే విధానానికి ఇమ్మాన్యుయెల్ ని ఎవరు నామినేట్ చెయ్యడం లేదు. అలా నామినేషన్స్ లోకి రాకపోతే తన ఫ్యాన్స్ బేస్ తగ్గిపోతుంది, తాను నామినేషన్స్ లోకి వస్తే అభిమానులు నిద్రపోతారేమో అని ఇమ్మాన్యుయెల్ భయపడుతున్నాడు. 

Advertisement
CJ Advs

హౌస్ లోనే కాదు బయట కూడా ఇమ్మాన్యుయెల్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడొక లేడీ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయెల్ కి పోటీగా తయారైంది. తాజా ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కూడా ఇమ్మాన్యుయెల్ కి పోటీ తనూజ అంటూ తేల్చేసారు. బయట కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. నాగార్జున హౌస్ లో ఎవరు ట్రోఫీకి దగ్గరగా వెళుతున్నారు, ఎవరు ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నారు అంటే.. 

ఐదుగురు తనూజ అన్నారు, ఐదుగురు ఇమ్మాన్యుయెల్ అన్నారు. సంజన డిమాన్ పవన్ అంటే, మరొకరు కళ్యాణ్ కూడా ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉంది అన్నారు. ఇక నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి తనూజ కు భారీ ఓటింగ్ దక్కుతుంది. బుల్లితెర ఆడియన్స్ అంతా తనూజ ని ఇష్టపడుతున్నారు. 

సో ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్ లేదంటే తనూజ విన్నర్స్ అని హౌస్ మేట్స్ తెల్చేయ్యగా.. బయట ఆడియన్స్ మాత్రం సుమన్ శెట్టి కూడా  విన్నింగ్ అయ్యే ఛాన్స్ వుంది అంటున్నారు. 

Bigg Boss 9: Emmanuel vs Thanuja:

Bigg Boss 9: Thanuja-Emmanuel emerge as top contenders
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs