నిన్న శుక్రవారం అంటే నవంబర్ 7 న విడుదలైన సినిమాల్లో రష్మిక గర్ల్ ఫ్రెండ్, తిరువీర్ ప్రీ వెడ్డింగ్ షో కి అదిరిపోయే సూపర్ హిట్ టాక్ రాకపోయినా.. ఆడియన్స్ నుంచి సినీ విమర్శకుల నుంచి హిట్ టాక్ వచ్చింది. రెండు సినిమాలకు ఆడియన్స్ ఇంప్రెస్స్ అయ్యారు. అదే రోజు మంచి అంచనాలతో విడుదలైన జటాధర కి మాత్రం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జటాధర చిత్రానికి క్రిటిక్స్ పూర్ రివ్యూస్ ఇచ్చారు. సినిమా అస్సలు బాలేదు అంటూ వీక్ రేటింగ్స్ ఇవ్వడమే కాదు.. సుధీర్ బాబు సిన్సియర్ గా కష్టపడ్డారు. టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్నా.. స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్ అన్ని జటాధరని ప్లాప్ లిస్ట్ లో చేరేలా చేసాయి అంటూ విమర్శించారు. ఆడియన్స్ లో జటాధర పై ఎంత ఆసక్తి ఉందొ అనేది ఓపెనింగ్స్ రోజు తెలియలేదు.
కానీ ఈ వీక్ టాక్ తోనే జటాధర మంచి నెంబర్లు నమోదు చెయ్యడం అందరికి షాకిచ్చింది. సుధీర్ బాబు జటాధర థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. అటు మేకర్స్ కూడా జటాధర కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తున్నారు. అది చూసే టాక్ వీక్ కానీ కలెక్షన్స్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు మంచి టాక్ వచ్చిన గర్ల్ ఫ్రెండ్, ప్రీ వెడ్డింగ్ షో కి కలెక్షన్స్ కనిపించకపోవడం ఆశ్చర్యకర విషయమే.