వైల్డ్ కార్డు గా వచ్చిన దివ్య స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణి తో క్లోజ్ గా ఉంటూ.. భరణి తనూజ తో క్లోజ్ అవడం భరించలేక భరణి ని తనూజ ని దూరం చెయ్యడమే కాదు తనూజ ను టాస్క్ లో ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ లో ఓడిద్దామని పర్సనల్ రీజన్స్ పెట్టుకుని హౌస్ మేట్స్ తో మాట్లాడిన మాటలను హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో వీడియోస్ వేసి దివ్య ను బాగా ఎక్స్పోజ్ చేసారు.
నేను జెన్యూన్, నాకు తనూజ పై ఎలాంటి పర్సనల్ రీజన్స్ లేవు అంటూనే ఈ వారం నామినేషన్స్ లో పెట్టడం, అలాగే కెప్టెన్సీ టాస్క్ లో తనూజ ను తియ్యను అని కళ్యాణ్ కి మాటిచ్చి ఇమ్మాన్యువల్ ని కెప్టెన్ ని చెయ్యడం దివ్య ను ఆడియన్స్ లో బ్యాడ్ చేసాయి. అసలే ఆడియన్స్ ఆమెని టాప్ 10 లో లేకుండా చెయ్యడం ఆమెకు ఒక బాధ.
అలాగే హౌస్ మేట్స్ ఒక్కరు కూడా దివ్య ఆటను మెచ్చుకోకపోవడం అదొక బాధ, దివ్య ఎంత గా డిపెండ్ చేసుకుందామని చూసినా హోస్ట్ నాగార్జున దివ్య నీ టాస్క్ నువ్వు ఆడుకో, నీకోసం నువ్వు ఆడు, కానీ ఒకరు ఓడిపోవాలనే థాట్ తో ఆడకు అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో దివ్య ఫేస్ మాడిపోవడమే కాదు ఆమె మొహం వాడిపోయింది.
దానితో పాపం దివ్య భరణి కోసం తనూజ ను టార్గెట్ చేసి బాగా బుక్ అయ్యింది అంటూ కామెంట్లు పెడుతున్నారు