పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ టైటిల్ అనౌన్సమెంట్ తోనే సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ ముగించేసి ఫౌజీ షూటింగ్ ని సీరియస్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు, ఇప్పటివరకు జరిగిన ఫౌజీ షూటింగ్ అంతా సూపర్ గా వచ్చింది అంటున్నారు.
హను రాఘవపూడి సీన్స్ డిజైనింగ్, ఫ్రేమ్స్ అలాగే టోటల్ వర్క్ పై ప్రభాస్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారట. హను రాఘవపూడి మేకింగ్ స్టయిల్ తో ప్రభాస్ ఫిదా అవుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అతి త్వరలోనే ఫౌజీ టీమ్ మైసూర్ షెడ్యూల్ వెళ్లనుందని సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి కాగా.. ఫౌజీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల చేస్తున్నట్లుగా ఫౌజీ మేకర్స్ ప్రకటించేసారు. సో వచ్చే ఏడాది ప్రభాస్ రాజా సాబ్ అలాగే ఫౌజీ తో ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నారు.