సీఎం రేవంత్ రెడ్డి-కేటీఆర్ నడుమ మాటలు తూటాల్లా పేలుతుండడం చూస్తుంటాము. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగా పనికి రాడు అని కేటీఆర్ అంటే కేటీఆర్ దొర బిడ్డ, సినీ ప్రముఖులతో ఫ్రెండ్ షిప్ చేస్తాడు, ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ చేస్తాడు అంటూ కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు తెగ వైరల్ అవుతుంటాయి.
కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిలకు ప్రచారం పుష్ప 2 చిత్రంలో శ్రీలీల ఐటెం సాంగ్ మాదిరి ఉంది అంటూ రేవంత్ తీవ్రమైన కామెంట్లు చేసారు. సినిమాలో స్టోరీ మధ్యలో ఆడియన్స్ ను యూత్ ని ఉత్తేజపరిచేందుకు ఐటమ్ సాంగ్ వస్తుందని, అలానే జూబ్లీహిల్స్ లో కేటీఆర్ ప్రచారం ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తి చెయ్యలేదు అంటూ కేటీఆర్ LED స్క్రీన్ వేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చెయ్యగా.. దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అన్నిటిని పూర్తి చేస్తుంది. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది, కేటీఆర్ ప్రచారం శ్రీలీల ఐటెం సాంగ్ లా ఉంది అంటూ చేసిన ఘాటు కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్నాయి.