మాజీ సీఎం కేసీఆర్ కి జూబ్లీహిల్స్ వద్దా.. కావాలంటే కనీసం వీడియో ప్రచారమైనా చెయ్యాలి కదా.. ఎన్నికల్లో ఓడిపోయాక ఎంతవరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కాలక్షేపం చేస్తున్న కేసీఆర్ యాక్టీవ్ గా ఉండడం లేదు, పార్టీ సమావేశాలు కూడా ఫామ్ హౌస్ లోనే పెడుతున్నారు తప్ప బయట కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నట్టుగానే కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు.
మంగళవారం జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనుంచి అందరూ ప్రచారం చేసారు. గులాబీ పార్టీ నుంచి కేటీఆర్, హారిష్ రావు, గోపినాధ్ ఫ్యామిలీ అందరూ ప్రచారం చేసారు. అసలే సునీత గోపినాధ్ భార్య కాదు అంటూ నానా గందరగోళం, మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూకుడు అన్ని ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.
అయితే కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ కోసం ప్రచాచారానికి దిగితే బావుండేది అని కార్యకర్తలు కోరుకున్నారు. కానీ కేసీఆర్ కనీసం ఈ ఎన్నికను పట్టించుకోలేదు. ఆయన లేకుండానే, కేసీఆర్ ప్రచారం చెయ్యడకుండానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఇక ఫలితం ఏమిటి అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ నెల 14 న గెలుపెవరిదో తెలుస్తుంది.