అవును మెగా తండ్రి-కొడుకులు మ్యాజిక్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరు-నయనతార కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మన శంకర్ వర ప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో, ఎన్ని లైక్స్ కొల్లగొడుతుందో చూస్తున్నారు. రికార్డ్ స్థాయిలో మీసాలపిల్ల సాంగ్ ఇప్పటికే యాబై మిలియన్ వ్యూస్ దక్కించుకుని చిరంజీవి క్రేజ్ ను స్టామినాను ప్రూవ్ చేసింది.
ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ వంతు. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ - జాన్వీ కపూర్ కలయికలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం మార్చి లో విడుదల కాబోతుంది. బుచ్చిబాబు ఇప్పటినుంచే పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. రెహమాన్ మ్యూజిక్ లో చరణ్ డాన్స్ స్టెప్స్, జాన్వీ అందాలతో పెద్ది నుంచి చికిరీ చికిరీ ఫస్ట్ సింగిల్ వదిలారు.
ఎక్కడలేని హైప్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్న రామ్ చరణ్ పెద్ది లో వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరీ చికిరీ సాంగ్ దుమ్మురేపుతోంది. చాలారోజుల తర్వాత సంగీత దిగ్గజం ఏ ఆర్ రహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్.. మునుపటి రహమాన్ మాస్ క్లాస్ కలబోత మాయాజాలాన్ని మరోసారి ఆవిష్కరించింది.
తెలుగు లోనే కాది హిందీ భాషల్లో పెద్ది చికిరీ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరి ఒకే సమయంలో తండ్రి చిరు-కొడుకు చరణ్ ల సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.