బిగ్ బాస్ సీజన్ 9 అప్పుడే రెండు నెలలు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ తనూజ, దివ్య మద్యన చిచ్చు పెట్టింది. కెప్టెన్ గా దివ్య సపోర్ట్ చేయకపోవడంతో తనూజ విపరీతంగా హార్ట్ అయ్యి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక ఈ వారం కెప్టెన్సీ డ్రామా ముగిసి ఇమ్మాన్యువల్ రెండోసారి కెప్టెన్ అయ్యాడు.
అయితే గత వారం మాధురి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనే విషయంలో అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఈ వారం తనూజ, కళ్యాణ్, సంజన, భరణి, సాయి, సుమన్ శెట్టి, రాము లు నామినేషన్స్ లో ఉన్నారు.
అందులో తనూజ అందరి కన్నా ఎక్కువ ఆడియన్స్ మనసు గెలుచుకుని ఓట్లు కొల్లగొడుతూ మొదటిస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ఆమెకు కళ్యాణ్ గట్టిపోటీ ఇస్తున్నాడు. మూడో స్తానం కోసం సంజన, సాయి పోటీపడినా.. అనూహ్యంగా సీక్రెట్ టాస్క్ తో సుమన్ శెట్టి మూడో స్తానంలోకి వచ్చేసాడు. భరణి, సంజన ఒకరి తర్వాత ఒకరు అతి తక్కువ ఓట్లతో తమ తమ స్థానంలో కనిపించారు. కానీ సాయి ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చాడు.
ఎప్పుడు ఇంటికి వెళ్లిపోవాలా అని ఆలోచిస్తూ గేమ్ ఆడడం మానేసి, గివ్ అప్ ఇచ్చేస్తున్న రాము రాథోడ్ ని ఇంటికి పంపెయ్యాలని ఆడియన్స్ డిసైడ్ అయ్యారు. మరి రాము, సాయి లు ఈ వారం డేంజర్ జోన్ లో ఉండగా.. రాము నే ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నప్పటికీ తనూజ సేవింగ్ పవర్ వాడి అతన్ని కాపాడే ఛాన్స్ లేకపోలేదు. చూద్దాం రాము, సాయి లలో ఈవారం ఎవరు బయటికి వెళతారో అనేది.