అవును రాజ్ నిడమోరు తో సమంత తన రిలేషన్ ని కన్ ఫర్మ్ చేసేసిందా, అంటే అవుననే అంటున్నారు నెటిజెన్లు. సోషల్ మీడియా లో ఇన్స్టా హ్యాండిల్ నుంచి రాజ్ నిడమోరు ని హగ్ చేసుకున్న పిక్ ని సమంత షేర్ చేసింది. అది చూసాక వీరి డేటింగ్ రూమర్స్ ను సమంత ఇలాంటి పిక్ తో కన్ ఫర్మ్ చేసేసిందా అనే అనుమానాలు మళ్లీ రాజుకున్నాయి.
సమంత తన బిజినెస్ లో భాగంగా ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ఓపెన్ చేసింది. ఆ ఈవెంట్ లో తమన్నా లాంటి స్టార్స్ కనిపించారు. అందులో స్పెషల్ గా కనిపించింది మాత్రం రాజ్ నిడమోరు. రాజ్ నిడమోరు తో సమంత అంత క్లోజ్ గా హగ్ చేసుకోవడం, ఆ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం చూసి.. వారి మద్యన డేటింగ్ రూమర్స్ కాదు అది పక్కానే అంటూ ఫిక్స్ అవుతున్నారు.
మరి ఎన్నాళ్ళు సమంత ఈ దాగుడు మూటలు ఆడుతుందో అంటూ నెటిజెన్స్ స్ట్రయిట్ గానే సామ్ ని ప్రశ్నిస్తున్నారు. మరి సమంత ఏం చెబుతుందో చూడాలి.