Advertisement
Google Ads BL

అకాడెమీ మ్యూజియంలో ఆత్మ‌


జానపద కథలు, హార‌ర్ క‌థ‌ల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటుంది. ఈ ఏడాది విడుద‌లైన చిత్రాల్లో భ్ర‌మయుగం అద్భుత‌మైన హార‌ర్ స్టోరీతో అల‌రించింది. ఇటీవల తన పాత్రకుగాను మ‌మ్ముట్టి మరో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకోవడంతో భ్ర‌మ‌యుగం సినిమాలో ఏం ఉందో తెలుసుకోవాల‌నే ఉత్సాహం అభిమానుల్లో పెరుగుతోంది. భ్ర‌మయుగం విడుద‌లై చాలా కాల‌మే అయినా, ఇప్ప‌టికీ వేవ్స్ క్రియేట్ చేస్తోంది.  ఈ ప్రయోగాత్మకమైన మలయాళ చిత్రం ఈ రకమైన ప్రపంచవ్యాప్తంగా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది.

Advertisement
CJ Advs

తాజా స‌మాచారం మేర‌కు.. ఫిబ్రవరి 12, 2026న లాస్ ఏంజిల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ప్రత్యేక ప్రదర్శన కోసం ఈ చిత్రం ఎంపికైంది. ఇది ``వేర్ ది ఫారెస్ట్ మీట్స్ ది సీ: ఫోక్‌లోర్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్`` అనే కాన్సెప్టుతో లైనప్‌లో చేరిన ఏకైక భారతీయ చిత్రమిది.

ఈ హార‌ర్ చిత్రం మొదట ఫిబ్రవరి 2024లో విడుదలైంది. బ్లాక్ అండ్ వైట్ విజువ‌ల్స్ ఉన్న రోజుల్లోనే రాహుల్ సదాశివన్ సృష్టించిన అద్భుత‌మైన‌ టోన్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. కొడుమోన్ పొట్టిగా మమ్ముట్టి నటనకు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇది గ‌గుర్పాటు కలిగించే పాత భవనంలో సాగే క‌థ‌తో రూపొందింది.  అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ , అమల్డా లిజ్ త‌దిత‌రులు న‌టించారు. 

Bramayugam Gets Rare Honour:

&nbsp; <p class="MsoNormal">Mammootty <span>&nbsp;</span>Bramayugam Screened at Academy Museum in Los Angeles &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs