కొద్దిరోజులుగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీ రీ ఎంబర్స్ మెంట్ కోసం ప్రభుత్వం తో ఫైట్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు గేట్లకు తాళాలు వేసి బంద్ చేస్తున్నాయి. ఎగ్జామ్స్ ని కూడా పోస్ట్ పోన్ చేసాయి. మరోపక్క విద్యాసంస్థలకు మద్దతుగా విద్యార్థి సంఘాలు హైదరాబాద్ కి వేలాదిమంది విద్యార్థులతో బహిరంగ సభ కోసం సిద్దమవుతున్నాయి.
అటు ప్రభుత్వం దిగి రాక, ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఓ మెట్టు దిగక విద్యార్థులు వారం రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. ప్రవేట్ కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీ రీ ఎంబర్స్ మెంట్ ను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
విద్యార్థి సంఘాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమై సమస్యల పరిష్కారం చేయడంతో రేపటినుంచి ప్రవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు యధావిధిగా తెరుచుకోనున్నాయి. ప్రైవేట్ కాలేజీలు అడిగిన 1500 కోట్ల ఫీ రీ ఎంబర్స్ మెంట్ ని చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది.
ఇప్పటికే 600 కోట్లు చెల్లించిన ప్రభుత్వం ఇప్పుడు 600 కోట్లు విడుదల చేస్తామని, ఆ తర్వాత మూడు వందల కోట్లు చెల్లిస్తామని, ప్రైవేట్ కాలేజీల పై ఓ కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామని భట్టి చెప్పడంతో ప్రైవేట్ కళాశాలల బంద్ సుఖాంతమైంది.