బిగ్ బాస్ సీజన్ 9లోకి కామనర్ అడుగుపెట్టిన పడాల కళ్యాణ్ మొదటి రెండు వారాలుగా అస్సలు ఎవ్వరికి కనిపించలేదు, అతను హౌస్ లో ఉన్నాడనే విషయమే ఎవరికీ రిజిస్టర్ అవ్వలేదు. ఆతర్వాత తనూజ చుట్టూ తిరుగుతూ తనూజా సలహాలతో ఆటలో అదరగొడుతున్న కళ్యాణ్ పై బయట ఆడియన్స్ లో అంచనాలు మొదలయ్యాయి.
హౌస్ లో తనూజ విషయంలో అతను బ్యాడ్ అవుతున్నాడని వైల్డ్ కార్డు ఎంట్రీ లు హెచ్చరించడం, శ్రీజ తనూజ ను బ్లేమ్ చేస్తూ కళ్యాణ్ ని నామినేట్ చేసి అతని తప్పుని చూపించడంతో కళ్యాణ్ తనూజ నుంచి పక్కకెళ్లి శ్రీజ కోసం ప్రాణం పెట్టి టాస్క్ లు ఆడాడు. ఇక నామినేషన్ లో కళ్యాణ్ ఉన్నాడు అంటే చాలు అతను తనూజ కన్నా ఎక్కువ ఓట్లు కొల్లగొడుతూ స్ట్రాంగ్ ప్లేయర్ గా మారిపోయాడు.
ఈ వారం నామినేషన్స్ లో తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, సాయి, రాము, భరణిలు ఉండగా.. ఓటింగ్ లో టాప్ లో ఉండే తనూజ ను కళ్యాణ్ పడాల తోక్కేసి ఈ వారం ఓటింగ్ లో టాప్ లో నిలిచాడు. రెండో స్థానంలో తనూజ ఉండగా.. మూడో ప్లేస్ లో సంజన, అనూహ్యంగా సాయి నాలుగో స్థానంలోకి రావడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక ఈవారం డేంజర్ జోన్ లో భరణి తో పాటుగా సుమన్ శెట్టి ఉండడం మాత్రం నిజంగా ఆయన అభిమానులకి షాకిచ్చింది. ఓటింగ్ లో మొదటి, లేదా రెండో ప్లేస్ లో ఉండే సుమన్ శెట్టి డేంజర్ జోన్ లోకి వచ్చారు. సీక్రెట్ టాస్క్ అద్దరగొట్టిన సుమన్ శెట్టి టాప్ లోకి వస్తాడేమో చూడాలి. ఇక రాము రాధోడ్ కూడా ఈ వారం డేంజర్ స్థానంలోనే కనిపిస్తున్నాడు.