ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఆతర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ లో జాయిన్ అయ్యి అక్కడ ఓడిపోయి.. ఆతర్వాత జగన్ ని నమ్ముకుని వైసీపీ లో చేరిన రోజా సెల్వమణి.. అటు రాజకీయాలతో పాటుగా ఇటు బుల్లితెర పై జబర్దస్త్ కి జెడ్జి గా బాగానే వెనకేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఎమ్యెల్యేగా గెలిచి కూడా జబర్దస్త్ ని కంటిన్యూ చేసిన రోజా మంత్రి పదవి వచ్చాక జబర్దస్త్ ని వదిలేసింది.
అయితే మధ్యలో రోజా కొన్ని సినిమాల్లో అమ్మ పాత్రల్లో కనిపించి అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో దానిని ఆమె కంటిన్యూ చెయ్యలేదు. ప్రస్తుతం ఎమ్యెల్యే గా ఓడిపోయి, జబర్దస్త్ ని వదులుకుని జీ తెలుగులో ప్రతి ఒక్క షో లో కనబడుతున్న RK రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్త వైరల్ అవుతోంది.
అయితే రోజా టాలీవుడ్ నుంచి రీ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఆమె తమిళ ఇండస్ట్రీ నుంచి రీ ఎంట్రీ కి రంగం సిద్ధం చేసుకుంటుంది. రోజా లెనిన్ ఇండియన్ అనే మూవీ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలచంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో రోజా పాత్ర ని రివీల్ చేసారు. సో రోజా కోలీవుడ్ నుంచి త్వరలోనే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించబోతుందన్నమాట.
ఇకపై ఆమె రాజకీయాలు కొనసాగిస్తుందా, లేదంటే బ్రేక్ తీసుకుంటుందా అనేది క్లారిటీ లేదు. కారణం వైసీపీ కి అధికార ప్రతినిధి అయినా ఆమె వైసీపీ పార్టీలో అంతగా యాక్టీవ్ గా ఉండడం లేదు.