ప్రభాస్ అతిథి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో పని చేసే నటులు, హీరోయిన్లు చాలామంది ప్రభాస్ అధిత్యం గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ప్రభాస్ తన తోటి నటులకు తన ఇంటి నుంచి రకరకాల నాన్ వెజ్ కర్రీస్ తో అద్భుతమైన ఫుడ్ ని పంపిస్తారు. ఆ విషయాన్ని వీడియోస్ తో సహా చెబుతారు వాళ్ళు.
తాజాగా ప్రభాస్ కలిసి కల్కి చిత్రంలో పని చేసిన బాలీవుడ్ క్యూటీ దిశా పటానీ ప్రభాస్ ఫుడ్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ అందరితో పంచుకుంది. కల్కి చిత్రం చేసేటప్పుడు సెట్ లో ప్రభాస్ చాలా కేరింగ్ గా ఉండేవాడు. ప్రతీరోజు తన ఇంటి నుంచి పెద్ద ఎత్తున ఫుడ్ క్యారేజీలు పంపించేవాడు.
ప్రభాస్ పంపించే అంత మంచి ఫుడ్ చూస్తే ఎవరు కంట్రోల్ చేసుకోలేరు.. అందుకే నేను ఆ ఫుడ్ ను చాలా ఇష్టంగా తినేసేదాన్ని. అంత అద్భుతమైన వంటకాల వల్ల నా డైట్ పూర్తిగా చెడిపోయింది.. అదంతా ప్రభాస్ వల్లే అంటూ దిశా పటాని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఇచ్చిన ఆదిత్యంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.