అక్టోబర్ 16 న మంచి అంఛనాలతో విడుదలైన ప్రియదర్శి మిత్ర మండలి చిత్రం ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేసింది. మిత్రమండలి ప్రమోషన్స్, ప్రియదర్శి కథల ఎంపికలో ప్రత్యేకత అన్ని ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచింది. అదే ఊపులో మేకర్స్ మిత్రమండలి స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.
ప్రీమియర్స్ కే డివైడ్ టాక్ రావడంతో మిత్రమండలి రెండో రోజుకే థియేటర్స్ లో సైలెంట్ అయ్యింది. ఇక ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోగా.. ఇప్పుడు దీనిని ఓటీటీ స్ట్రీమింగ్ కి తెచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్దమై అఫీషియల్ డేట్ ను కూడా ఇచ్చేసింది.
నవంబర్ 6 నుంచి అంటే రేపు గురువారం అమెజాన్ ప్రైమ్ వేదికగా మిత్రమండలి స్ట్రీమింగ్ కానున్నట్లుగా అనౌన్స్ చేసారు.