నందమూరి నటసింహ బాలకృష్ణ సక్సెస్ ల పరంపరలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య నుంచి అఖండ 2 వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 5 న విడుదలకు రెడీ అవుతుంది. ఆతర్వాత ఆయన గోపీచంద్ మలినేని తో సినిమా చెయ్యాలి. ఈమద్యలో బాలయ్య సూపర్ స్టార్ రజిని జైలర్ 2 లో గెస్ట్ పాత్రకు ఒప్పుకున్నారు అనే ప్రచారం జరిగింది.
అదే నందమూరి అభిమానులను బాగా ఎగ్జైట్ చేసింది. జైలర్ లో మిస్ అయిన బాలయ్య జైలర్ 2 లో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ వారు చాలా హ్యాపీ గా ఉన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య జైలర్ ఆఫర్ ను ఒప్పుకోలేదు, ఆయన్ని అడిగినప్పుడే ఆయన నో చెప్పారనే మాట అభిమానులను బాగా డిజప్పాయింట్ చేస్తుంది.
దానికి పెద్ద కారణమే ఉందట. ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో ఏ స్టార్ హీరో సినిమాలో అయినా గెస్ట్ గా కనిపించడం కరెక్ట్ కాదు అని బాలయ్య కుమార్తె తేజస్విని ఇచ్చిన సలహా వల్లే ఆయన జైలర్ 2 వదులుకున్నారని అంటున్నారు. మరి బాలయ్య రీసెంట్ సక్సెస్ వెనుక ఆయన కుమార్తె తేజస్విని ఉంది. ఇది అందరికి తెలిసిన విషయమే.
కాకపోతే జైలర్ 2 వద్దని బాలయ్య చెప్పడానికి వెనుక తేజస్విని ఉందా, లేదంటే మరేదన్నా కారణమా అనేది తెలియదు కానీ.. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.