అందరికి హ్యాట్రిక్ హిట్స్ పడతాయి, లేదంటే హ్యాట్రిక్ ప్లాప్స్ పడతాయి. కానీ ఇప్పుడొక బ్యూటీ కి డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ తో అభిమానులను డిజప్పాయింట్ చేసింది. కెరీర్ లో బోలెడన్ని అవకాశాలు, కానీ ఒక్కటి సద్వినియోగం చేసుకోలేక నిరాశపరుస్తున్న హీరోయిన్ ఎవరో ఈపాటికే గెస్ చేసి ఉంటారు మీరు.
ఆమె శ్రీలీల. శ్రీలీల పెళ్లి సందD తో ఎంత వేగంగా కెరీర్ స్టార్ట్ చేసిందో అంతే వేగంగా డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకుంది. అమ్మడు అందం, డాన్స్ లను చూసిన హీరోలు బెల్లం చుట్టూ ఈగలు వలే శ్రీలీల చుట్టూ చేరారు. కానీ శ్రీలీల డెసిషన్స్ రాంగ్, అవకాశం వచ్చింది కదా అని వచ్చిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై అవకాశాలు వస్తాయో, రావో అన్నట్టుగా శ్రీలీల ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి. మాస్ జాతర శ్రీలీల పాత్ర బావుంది. కానీ సినిమా ఆమెను మోసం చేసింది.
ప్రస్తుతం శ్రీలీల భారమంతా తమిళ సినిమా పరాశక్తిపైనే వేసింది. శివకార్తికేయన్ తో కలిసి నటించిన పరాశక్తి చిత్రం శ్రీలీల కు ఏమైనా హిట్ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. అది కూడా శ్రీలీల కు హిట్ ఇవ్వాలి, లేదంటే శ్రీలీల పనైపోయినట్లే. ఇప్పుడు శ్రీలీల భారమంతా పరాశక్తిపైనే వేసింది.